దసరా కానుకగా ఎన్.టి.ఆర్ 25వ సినిమా ఫస్ట్ టీజర్

దసరా కానుకగా ఎన్.టి.ఆర్ 25వ సినిమా ఫస్ట్ టీజర్

Published on Aug 31, 2015 4:42 PM IST

ntr-new-still

సినిమా సినిమాకి పొంతన లేకుండా డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలు చేయడానికి ఇష్టపడే సుకుమార్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న 25వ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్.టి.ఆర్ మునుపెన్నడూ లేని విధంగా అవుట్ అండ్ అవుట్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ జూలై మొదటి వారంలో మొదలై ఏ మాత్రం గ్యాప్ లేకుండా లండన్ లో కంటిన్యూగా జరగుతోంది. ఎన్.టి.ఆర్ కూడా ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇటీవలే ఈ చిత్ర టీం 2016 జనవరి 8న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారని తెలియజేశాం.

ఇప్పుడు ఎన్.టి.ఆర్ అభిమానులకు మరొక శుభవార్త తెలియజేయనున్నాం. ఎన్.టి.ఆర్ తన అభిమానులకు దసరా కానుకని ప్లాన్ చేసాడు. దసరా కానుకగా తన 25వ సినిమా ఫస్ట్ టీజర్ ని లాంచ్ చెయ్యడానికి సిద్దమయ్యారు. తన అభిమానులకు పండుగ కానుక ఏమన్నా ఇవ్వాలి అనుకున్న ఎన్.టి.ఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎన్.టి.ఆర్ సరసన టాలీవుడ్ లేటెస్ట్ గోల్డెన్ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపిస్తోంది. ఎన్.టి.ఆర్ ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాకి నాన్నకు ప్రేమతో అనీ టైటిల్ ని పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్ చివరి వరకూ ఈ సినిమా షూటింగ్ లండన్ లోనే జరుగుతుంది. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలోని 90% షూటింగ్ అబ్రాడ్ లోనే జరగనుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు