టాలీవుడ్ టాప్ డాన్సర్లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. గత రెండు మూడు సినిమాలలో ఎన్టీఆర్ స్థాయికి తగ్గ డాన్సులు వేయలేదని నందమూరి అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. ఆ లోటును ‘టెంపర్’తో తీర్చనున్నాడు ఎన్టీఆర్. ‘టెంపర్’ టైటిల్ సాంగులో ఇరగదీసి డాన్స్ చేశాడని యూనిట్ సభ్యుల టాక్. ‘యమదొంగ’లో ‘నాచోరే.. నాచోరే..’ తరహాలో కుమ్మేశాడట. ఇక, నందమూరి అభిమానులకు విందు భోజనం రెడీ అనమాట.
పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించారు. ట్రైలర్లు, సాంగ్ ప్రోమోలకు అద్బుత స్పందన లభించింది. ఇండస్ట్రీ వర్గాలలో సైతం సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడడంతో బిజినెస్ బాగా జరుగుతుందని సమాచారం. ఫిబ్రవరి 13న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


