యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న తన తదుపరి సినిమా ‘నాన్నకు ప్రేమతో’. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ జూలై నుంచి లండన్ లో షూటింగ్ మొదలు పెట్టి నిరవధికగా 80 రోజులు షూటింగ్ చేసి ఇటీవలే ఇండియాకి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కాస్త క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తున్నాడు. మొదటి షెడ్యూల్ తోనే దాదాపు 70% షూటింగ్ ఫినిష్ చేసాడు ఎన్.టి.ఆర్. ఇటీవల ఈ సినిమా రషెస్ చూసుకున్న ఈ చిత్ర టీం అవుట్ పుట్ విషయంలో చాలా చాలా హ్యాపీగా ఉన్నారు.
ఒక మూడు వారాలు గ్యాప్ తీసుకున్న నాన్నకు ప్రేమతో టీం తదుపరి షెడ్యూల్ కోసం అక్టోబర్ లో స్పెయిన్ వెళ్లనున్నారని ఇదివరకే తెలియజేశాం. కానీ కచ్చితమైన తేదీ లేదు.. ఈ విషయాన్ని మేము ఈ హ్సిత్ర టీంతో మాట్లాడి తెలుసుకున్నాం. అక్టోబర్ 15న ఎన్.టి.ఆర్ అండ్ అతని టీం మొత్తం కలిసి స్పెయిన్ కి బయలుదేరనున్నారు. అక్టోబర్ 16 లేదా 17 నుంచి ఎన్.టి.ఆర్ స్పెయిన్ లో షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. ఈ స్పెయిన్ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ మొతం పూర్తవుతుంది. ఆ తర్వాత మిగిలి ఉన్న చిన్న చిన్న బిట్స్ ని హైదరాబాద్ లో షూట్ చేస్తారు.
ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2016 జనవరి 8న రిలీజ్ కానుంది.


