ఎన్టీఆర్ ట్రైనర్ ఇచ్చే ఆ సర్పైజ్ ఏమిటో?

ఎన్టీఆర్ ట్రైనర్ ఇచ్చే ఆ సర్పైజ్ ఏమిటో?

Published on May 19, 2020 9:37 PM IST

ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కొమరం భీమ్ గా కనిపించడానికి ఎన్టీఆర్ ప్రొఫెషనల్ జిమ్ ట్రైనర్ స్టీవ్ లాయిడ్స్ దగ్గర కొన్నాళ్ళు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఐతే స్టీవ్ లాయిడ్స్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా కొన్ని వీడియోలు విడుదల చేస్తారట. స్టీవ్ లాయిడ్స్ విడుదల చేయనున్న ఆ వీడియోలలో ఏముంది అనే ఉత్సకత ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో పెరిగిపోయింది.

ఇక ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని రాజమౌళి 400కోట్లకు పైగా బడ్జెట్ తో భారీగా నిర్మిస్తుండగా, మరో హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, బ్రిటిష్ స్టేజి ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవ్ గణ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు. రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు