యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో రూపొందుతున్న చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్లో యాక్షన్ సీక్వెన్సులతో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కూడ చిత్రీకరించిన టీమ్ ఈ మే నెలలో రెండో షెడ్యూల్ ను మొదలుపెట్టనుంది.
ఈ చిత్రంలో తారక్ పూర్తిగా రాయలసీమ యాసలోనే మాట్లాడనున్నారని తెలుస్తోంది. అందుకే ఆ యాసలో ఒక ఫోక్ సాంగ్ కూడ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ పాటను ఇటీవల విడుదలైన ‘కృష్ణార్జున యుద్ధం’లో ‘దారి చూడు దుమ్ము చూడు’ పాట పాడిన పెంచల్ దాస్ పాడనున్నారట. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అక్టోబర్ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.


