ఎన్టీఆర్-వక్కంతం వంశీ సినిమా లేటెస్ట్ అప్‌డేట్స్!

ఎన్టీఆర్-వక్కంతం వంశీ సినిమా లేటెస్ట్ అప్‌డేట్స్!

Published on Oct 12, 2015 9:26 PM IST

NTR-Nanaku-prematho
తెలుగులో ‘కిక్’, ‘రేసుగుర్రం’, ‘టెంపర్’ లాంటి పలు సూపర్ హిట్ సినిమాలకు కథా రచయితగా పనిచేసి మంచి క్రేజ్ తెచ్చుకున్న రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారి ఓ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఓ కథను వినిపించగా, ఆయన ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా కూడా ఊపారు. కాగా ఎన్టీఆర్ వరుసగా ఇతర కమిటైన సినిమాలతో బిజీగా ఉండడంతో ఎన్టీఆర్-వక్కంతం వంశీల సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్ళలేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ కాంబినేషన్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ మళ్ళీ ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చాయి. ప్రస్తుతం సుకుమార్‌తో నాన్నకు ప్రేమతో అనే సినిమా చేస్తోన్న ఎన్టీఆర్, ఆ తర్వాత కొరటాల శివతో మరో సినిమా చేయనున్నారు. ఇక ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందే సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుందని టాక్. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మార్చిలో ఈ సినిమా లాంచ్ కానుందని, 2016జూలై లేదా ఆగష్టులో సినిమా సెట్స్‌పైకి వెళుతుందని తెలుస్తోంది. ‘ఊసరవెల్లి’, ‘టెంపర్’ సినిమాలతో ఎన్టీఆర్‌కు పవర్ఫుల్ సినిమాలను రాసిన వక్కంతం వంశీ, తాను స్వయంగా దర్శకత్వం వహించే సినిమాకు కూడా అదేస్థాయి స్క్రిప్ట్ రెడీ చేశారని సమాచారం.

తాజా వార్తలు