రేపటి నుండి షూటింగ్లో పాల్గొననున్న ఎన్టీఆర్ !
Published on Aug 31, 2018 7:29 pm IST


తన తండ్రి హరికృష్ణ అకాలమరణం తో తీవ్ర దుఃఖం లోఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేపటి నుండి అరవింద సమేత షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఇది నిజంగా ఆయన అభిమానులకు శుభవార్తే. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో షూటింగ్ ను తొందరగా పూర్తి చేయాలని అలాగే ఆలస్యం చేస్తే సినిమా నిర్మాతకు కూడా నష్టం జరుగుతుంది కాబట్టి తారక్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు గా తెలుస్తుంది.

త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకకు ముహూర్తం ఖరారు చేయనున్నారని సమాచారం. హాసిని హారిక క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈచిత్రం దసరా కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook