‘ఎన్టీఆర్ – త్రివిక్రమ్’ సినిమా పై రేపు క్లారిటీ !

Published on Apr 11, 2021 5:44 pm IST

ఎన్టీఆర్ తో ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ త్రివిక్రమ్ చేస్తోన్న పాన్ ఇండియా మూవీ ఆగిపోయిందని ఇప్పటికే గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎన్టీఆర్ 30వ సినిమా పై క్లారిటీ రానుంది. ఎన్టీఆర్ టీమ్ నుండి అధికారికంగా ఒక ట్వీట్ వచ్చింది. ‘రేపు సాయంత్రం ఎన్టీఆర్ 30వ సినిమా గురించి అఫీషియల్ అప్ డేట్ ఉంటుందని.. అన్ని ప్రశ్నలకు సమాధానం రేపు లభించొచ్చు’ అంటూ మహేష్ కోనేరు ట్వీట్ చేశాడు.

కాగా ఈ సినిమా ఆగిపోలేదు అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఆధ్యాత్మిక టచ్ కూడా ఉంటుందట. త్రివిక్రమ్ సినిమా అంటేనే భారీ తనం ఉంటుంది. పైగా వరుసగా ఆరు సినిమాలతో ఫుల్ సక్సెస్ లో ఉన్న ఎన్టీఆర్ తో సినిమా అంటే, ఇక ఏ రేంజ్ లో సినిమా ఉంటుందో చూడాలి. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :