త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ కీలక సూచన

త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ కీలక సూచన

Published on Jul 21, 2020 9:39 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ కి ఓ కీలక సూచన చేశారని తెలుస్తుంది. ఆయన 30వ చిత్రం షూటింగ్ త్వరగా పూర్తి చేసేలా సన్నధం కావాలన్నారట. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ కూడా ఈ ఏడాదే మొదలుపెట్టాలని అనుకున్నారు.ఏకకాలంలో ఆర్ ఆర్ ఆర్ మరియు త్రివిక్రమ్ మూవీ పూర్తి చేయాలన్నది ఎన్టీఆర్ ప్రణాళిక. ఐతే లాక్ డౌన్ ఆయన ప్లాన్స్ మొతం తారుమారు చేసింది. ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొనడం అటుంచితే అసలు ఆర్ ఆర్ ఆర్ పూర్తి చేయడానికే సమయం పట్టేలా ఉంది.

దీనితో త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ కీలక సూచన చేశారట. తన మూవీ త్వరగా పూర్తి చేసేలా పక్కా ప్రొడక్షన్ డిజైన్ తో సిద్ధంగా ఉండాలని అన్నారట. దానికి కారణం ఎన్టీఆర్ కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో తన 31వ చిత్రం చేయాల్సివుంది. త్రివిక్రమ్ మూవీ ఆలస్యం అయ్యే పక్షంలో ఆ మూవీ మరింత లేటయ్యే అవకాశం ఉంది. అందుకే త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ ఇలాంటి సూచన చేశారట.

తాజా వార్తలు