చిట్ చాట్ : సమంత – ‘రభస’ ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లాంటి సినిమా.!

Published on Jul 1, 2014 1:26 pm IST

samntha-1

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లో తన హవా కొనసాగిస్తోంది. సమంత నటించిన ‘ఆటోనగర్ సూర్య’ సినిమా ఇటీవలే విడుదలై మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను, తన రాబోయే సినిమా విశేషాలను తెలుసుకోవడానికి సమంతతో కాసేపు ముచ్చటించాం. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) ‘ఆటోనగర్ సూర్య’ రిలీజ్ మరియు రిజల్ట్ పై మీ స్పందన ఏంటి.?

స) నా వరకూ అయితే ఈ సినిమా రిజల్ట్ కంటే మూవీ రిలీజ్ అవ్వడమే చాలా గొప్ప విషయం అనిపించింది. ఎందుకంటే నేను ‘బృందావనం’ తర్వాత ఈ సినిమాకి సైన్ చేసాను. రిలీజ్ కి 3 సంవత్సరాలు పట్టింది. ఇన్ని రోజులు సినిమా కోసం దేవకట్టా, చైతన్య చాలా కష్టపడ్డారు. దేవకట్టా సినిమాలో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ చెయ్యాలి. అందులోనూ దేవకట్టా రాసే మంచి డైలాగ్స్ చెప్పాలనుకుంటున్నాను.

ప్రశ్న) నాగ చైతన్యతో మూడోసారి పనిచేయడం ఎలా ఉంది? చైతన్య మాస్ లుక్, పెర్ఫార్మన్స్ ఎలా అనిపించింది?

స) నాగ చైతన్య సినిమా తో నా తెలుగు మూవీ కెరీర్ ప్రారంభమైంది. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. చైతు తో పనిచేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఇందులో చైతన్య చేసిన మాస్ పాత్ర, పెర్ఫార్మన్స్ నాకు చాలా బాగా నచ్చింది. వాయిస్ మాడ్యులేషన్ చాలా బాగుంది.

ప్రశ్న) నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలపైన దృష్టి పెట్టడం లేదా.?

స) ఇదే ప్రశ్నని చాలా మంది అడుగుతున్నారు. నేను కూడా అలాంటి అవకాశాల కోసమే ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతం కొన్ని కొత్త కొత్త కథలు వింటున్నాను. భవిష్యత్తులో అలాంటి సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే నటనా ప్రాధాన్యం ఉన్న సినిమా అంటే ‘మనం’. ఈ సినిమాలో నా నటనకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రశ్న) ‘అల్లుడు శీను’ చెయ్యడం కోసం 2 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని వస్తున్నా వార్తలపై మీ కామెంట్.?

స) ఆ వార్తలు నేను విన్నాను. కానీ అందులో నిజం లేదు. నిజం ఏమిటంటే నేను ప్రతి సినిమా కి తీసుకునే రెమ్యూనరేషన్ ఈ సినిమాకి తీసుకున్నాను. మీరందరూ అంటున్నట్లు 2 కోట్లు ఇచ్చి ఉంటే బాగుండేది. హీరోల మార్కెట్, స్టార్డం మరియు డైరెక్టర్ ని బట్టి సినిమాలు ఓకే చెయ్యను. కథ, నా పాత్ర గురించి విన్న తర్వాతే సినిమాకి ఓకే చెప్తాను. అల్లుడు శీను కోసం చాలా మంది సీనియర్ టెక్నీషియన్స్ పనిచేసారు. వినాయక్ గారైతే మొదటి సినిమా చేస్తున్నట్లు కష్టపడ్డారు. చాలా బాగా తీసారు. సినిమా పక్కాగా హిట్ అవుతుంది.

ప్రశ్న) ఈ మధ్య ప్రతి చోటా సరికొత్త స్టైల్స్ లో కనిపిస్తున్నారు. దానికి గల కారణం ఏమిటి?

స) ఈ సంవత్సరం మొత్తం 7 సినిమాల్లో నటిస్తున్నాను. అవి అన్నీ రిలీజ్ కూడా అవుతాయి. అలాగే ఈ సంవత్సరం చాలా ఈవెంట్స్ కి అటెండ్ కావాల్సి ఉంది. అన్ని దగ్గర్లా ఒకేలా కనిపిస్తే బాగుండదు కదా అందుకే ఈ మధ్య ఫ్యాషన్ మీద మరింత దృష్టి పెట్టాను.

ప్రశ్న) క్వీన్ రీమేక్ లో నటిస్తారని, అలాగే బెంగుళూరు డేస్ రీమేక్ కి కూడా సైన్ చేసారని వస్తున్న వార్తలపై మీ కామెంట్.?

స) ‘క్వీన్’ సినిమా బాలీవుడ్ లో హిట్ అయ్యి ప్రూవ్ చేసుకున్న సినిమా. అది ఇక్కడ చేయాలంటే కథలో చాలా మార్పులు చేయాలి. వాళ్ళు చేసిన మార్పులకి నేను కన్విన్స్ కాలేదు. అందుకే నో చెప్పాను. ఒకవేళ నేను కన్విన్స్ అయ్యేలా స్క్రిప్ట్ ని రెడీ చేస్తే ఆ సినిమా చేస్తాను. ఇక బెంగుళూరు డేస్ పై నో కామెంట్స్.

ప్రశ్న) యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో చేస్తున్న ‘రభస’ విశేషాలు చెప్పండి?

స) నేను ఎన్.టి.ఆర్ తో చేస్తున్న మూడవ సినిమా ‘రభస’. ఎన్.టి.ఆర్ సినిమా అంటే అందులో అన్నీ ఉంటాయి. యాక్షన్, కామెడీ మరియు సెంటిమెంట్ కలిసిన మంచి ఫుల్ మీల్స్ లాంటి మూవీ ‘రభస’. నేను ఫుల్ లెంగ్త్ చేసిన ఈ సినిమా ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది.

అంతటితో ఈ సౌత్ ఇండియన్ లక్కీ బ్యూటీకి అల్ ది బెస్ట్ చెప్పి మా చిట్ చాట్ ని ముగించాం..

సంబంధిత సమాచారం :