త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ రోల్ ?

Published on May 23, 2020 11:49 pm IST

ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ టాప్ కార్పొరేట్ బిజినెస్ మెన్ గా కనిపిస్తాడట. ఈ పాత్ర కోసం ఒక క్రేజీ మేక్ ఓవర్ లో ఎన్టీఆర్ వెరీ స్టైలిష్ గా కనిపిస్తాడట. ఈ వార్త ఇంకా ధృవీకరించబడనప్పటికీ, ఇప్పుడు ఇది ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారట. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ నుండి తీసుకోవాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం.

ఇక మరో కథానాయికగా తన గత రెండు సినిమాల్లో నటించిన పూజా హెగ్డేను తీసుకోవాలనే యోచనలో ఉన్నారట త్రివిక్రమ్. కాగా హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం అన్ని కుదిరితే నవంబర్ నుండి షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా 2021 దసరాకి విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More