నయా అవతార్ లో ఎన్టీఆర్.. ఖుషీగా ఫ్యాన్స్.. !

నయా అవతార్ లో ఎన్టీఆర్.. ఖుషీగా ఫ్యాన్స్.. !

Published on May 20, 2020 7:19 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజీ పిక్ ఒకటి నిన్న బయటికి వచ్చింది. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీలో రొమాంటిక్ లుక్ కాకరేపుతోంది. ఆర్ ఆర్ ఆర్ నుండి ఫస్ట్ లుక్ వీడియో లేదన్న నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కి ఈ ఒక్క క్రేజీ క్లిక్ వారికి కావలసిన జోష్ పంచింది. సిక్స్ ప్యాక్ లో షర్ట్ లేకుండా ఉన్న ఎన్టీఆర్ ఫోటో గత రాత్రి నుండి వైరల్ గా మారింది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ దానిపై షేర్స్ అండ్ లైక్స్ తో విరుచుకుపడుతున్నారు.

లాక్ డౌన్ కారణంగా ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేడుకలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినప్పటికీ సోషల్ మీడియాలో భారీగా సందడి చేయనున్నారు. ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీ, అలాగే కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేయనున్న చిత్రాలపై కూడా అప్డేట్స్ వచ్చే సూచనలు కలవు. ఏది ఏమైనా ఊహించినంత కాకపోయినా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొరకు కొన్ని బర్త్ డే సర్ప్రైజ్ లు ఉండవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు