నువ్వు తోపురా రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Mar 17, 2019 1:35 am IST

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కొమాకుల నటించిన తాజా చిత్రం నువ్వు తోపురా. ఇటీవల ఈ చిత్రం యొక్క టీజర్ ను విజయ్ దేవరకొండ విడుదలచేశాడు. ఇక ఈ చిత్రం యొక్క విడుదలతేది ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 26న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. గీతా ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని విడుదలచేయనుంది.

సీనియర్ హీరోయిన్ నిరోష ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించగా నిత్య శెట్టి కథానాయికగా నటించింది. హరినాథ్ బాబు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని యునైటెడ్ ఫిలిమ్స్ బ్యానేర్ ఫై డి శ్రీకాంత్ నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More