“నారప్ప” నుంచి మరో అల్టీమేట్ లిరికల్ వీడియో..!

Published on Jul 16, 2021 10:51 pm IST


విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన ఇంటెన్స్ క్రైమ్ ఎమోషనల్ డ్రామా “నారప్ప”. తమిళ సూపర్ హిట్ చిత్రం “అసురన్”కి ఈ సినిమా రీమేక్. దీనిపై ప్రేక్షకుల్లో ఫుల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. జూలై 20 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌, ‘చలాకీ చిన్నమ్మి’ పాటను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా మరో పాటను విడుదల చేసింది.

‘ఓ.. నారప్ప’ అంటూ సాగే అల్టీమేట్ లిరికల్‌ వీడియో విడుదల అయ్యింది. ఈ సినిమాలో వెంకటేశ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. యువకుడి పాత్రకి జోడీగా అభిరామి నటించింది. వీరిద్దరి మధ్య తెరక్కించిన పాట ఇది. అనంత శ్రీరామ్‌ రాసిన ఈ పాటను ధనుంజయ్‌, వరం ఆలపించగా మణిశర్మ సంగీతం అందించారు. వి క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌. థాను సమర్పణలో సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ సినిమాని సురేశ్‌ బాబు నిర్మించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :