“కొండపోలం” నుండి ఓబులమ్మ సాంగ్ రేపే విడుదల!

Published on Aug 26, 2021 8:00 pm IST

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో పంజా వైష్ణవ్ తేజ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం కొండపొలం. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ వేగం గా జరుగుతున్నాయి. ఈ చిత్రం టైటిల్ నుండి విడుదల అయిన పోస్టర్లు సినిమా పై ఆసక్తిని కలిగించే విధంగా ఉన్నాయి. ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ విడుదల కి చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేయడం జరిగింది.

కొందపోలం చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్ ఓబులమ్మ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్ తో వెల్లడించిన సంగతి తెలిసిందే.ఈ చిత్రం నుండి ఓబులమ్మ అనే పాట ను చిత్ర యూనిట్ రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనుంది. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై సాయి బాబు జాగర్లమూడి మరియు రాజీవ్ రెడ్డి లు నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 8 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :