ఆకట్టుకుంటున్న కొండ పొలం “ఓబులమ్మ” పాట!

Published on Aug 27, 2021 9:00 pm IST

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం కొండ పొలం. ఈ చిత్రం నుండి విడుదల అయిన పోస్టర్లు ఇప్పటికే ఆకట్టుకున్నాయి. తాజా గా ఈ చిత్రం నుండి ఒక పాట ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఓబులమ్మ అనే వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పాట తోనే సినిమా ఎలా ఉంటుంది అనే దాని పై ఒక క్లారిటీ వచ్చింది.

ఓబులమ్మ పాట కి ఎం ఎం కీరవాణి లిరిక్స్ రాసి సంగీతం అందించారు. సత్య యామిని మరియు పివిఎన్ఎస్ రోహిత్ లు స్వర పరిచారు. వై. రాజీవ్ రెడ్డి, జే. సాయి బాబు లు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 8 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :