ఆర్జీవీ చేసిన సిన్సియర్ అటెంప్ట్ ‘ఆఫీసర్’ – నాగార్జున
Published on May 31, 2018 11:44 am IST

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన చిత్రం ‘ఆఫీసర్’. అక్కినేని నాగార్జున ఈ చిత్రంలో కథానాయకుడి పాత్రను పోషించారు. రేపే ఈ సినిమా రిలీజ్ కానుంది. అందరిలోను వరుస పరాజయాల్లో ఉన్న ఆర్జీవి నాగార్జున ఇచ్చిన ఈ గోల్డెన్ ఛాన్సును ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలనే ఆసక్తి నెలకొని ఉంది. హీరో నాగార్జున అయితే సినిమా ఫలితంపై గట్టి నమ్మకంతోనే ఉన్నారు.

సినిమా మొదలవడానికి ముందే వంద శాతం మనసు పెడతానంటేనే సినిమా చేస్తానని ఆర్జీవికి ఖచ్చితంగా చెప్పేశానన్న నాగ్ ఇచ్చిన మాట ప్రకారమే వర్మ మనసు పెట్టి ఈ సినిమా చేశాడు. ఇది ఆయన చేసిన సిన్సియర్ అటెంప్ట్. ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుంది. ఇందులో పాత ఆర్జీవిని చూస్తారంటూ వర్మ పనితీరుపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook