ఆఫీసర్ ఎంత కలెక్ట్ చేశాడో తెలుసా !

ఆఫీసర్ ఎంత కలెక్ట్ చేశాడో తెలుసా !

Published on Jun 12, 2018 10:04 PM IST

officer

కింగ్ నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కలయికలో చాలా గ్యాప్ తరువాత వచ్చిన సినిమా ఆఫీసర్ . ఇక ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో మనకు తెలిసిందే. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 0. 71 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టగలిగిన ఈ సినిమా ఇప్పటివరకు కోటి రూపాయల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేసింది. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు సినిమా రన్ ఎలా సాగిందో.

నాగార్జున కెరీర్ లోనే ఇంత ఘోరమైన కలెక్షన్స్ ఏ సినిమాకి రాలేదు. నిజానికి సినిమాను మొదటివారంలోనే థియేటర్ల నుండి ఎత్తేసారు దాంతో ఈ చిత్రం భారీ నష్టాలనే మిగిల్చింది. నాగార్జునకు శివ సినిమా తో తిరుగులేని విజయాన్నిఅందించిన వర్మ అదే నాగ్ కు ఆఫీసర్ రూపంలో అత్యంత చెత్త సినిమాను కూడా అందించాడు .

తాజా వార్తలు