ఓవర్సీస్లో అంతగా ప్రభావం చూపలేకపోయిన ‘ఆఫీసర్’ !
Published on Jun 2, 2018 3:10 pm IST


నాగార్జున, రామ్ గోపాల్ వర్మల కానుకలో వచ్చిన చిత్రం ‘ఆఫీసర్’. విడుదలకు ముందు పెద్దగా బజ్ సాదించలేకపోయిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ అందుకోలేకపోయింది. ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లో కూడ కనిపిస్తోంది. సుమారు 52 లొకేషన్లలో ప్రీమియర్ల ద్వారా ప్రదర్శింపబడిన ఈ చిత్రం కేవలం 27,176 డాలర్లను మాత్రమే వసూలు చేసింది.

ఈ మొత్తం నాగార్జునగారి గత చిత్రాలతో పోలిస్తే చాలా తక్కువ. ఆయన గత సినిమాలో ‘రాజుగారిగది-2’ 81,000, ‘ఊపిరి’ 76,000, ‘సోగ్గాడే చిన్ని నాయన’ 50,000, ‘మనం’ 95,000ల డాలర్లను కలెక్ట్ చేశాయి. మరోవైపు మొదటి రోజు ఏమంత పాజిటివ్ టాక్ కూడ రాకపోవడంతో ముందు ముందు వసూళ్లు ఇంకాస్త బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook