ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకురాబోతున్న ‘ఆఫీసర్’ !

ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకురాబోతున్న ‘ఆఫీసర్’ !

Published on May 11, 2018 3:00 PM IST

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, నాగార్జునతో చేసిన తాజా చిత్రం ‘ఆఫీసర్’. కొన్ని రోజుల క్రితమే షూటింగ్ పూర్తియిచేసుకున్న ఈ చిత్రం పోస్టర్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు టీజర్లు విడుదలకాగా ట్రైలర్ ను సిద్ధం చేశారు యూనిట్. రేపు 10 గంటలకు ఈ ట్రైలర్ విడుదలకానుంది.

మే 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలచేయనున్నారు. వర్మ తన సొంత బ్యానర్ కంపెనీపై నిర్మించిన ఈ చిత్రంలో మైరా సరీన్ కథానాయకిగా కనిపించనుంది. నాగార్జున, వర్మల హిట్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు కూడ మంచి స్థాయిలోనే ఉన్నాయి. ఈ చిత్రంలో నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.

తాజా వార్తలు