బిగ్ అప్డేట్..”అపరిచితుడు” హిందీ వెర్షన్ అతని తోనే.!

Published on Apr 14, 2021 12:00 pm IST

ఇండియన్ జేమ్స్ కెమెరూన్ శంకర్ తెరకెక్కించిన అద్భుత చిత్రాల్లో చియాన్ విక్రమ్ తో తీసిన “అన్నియన్” తెలుగులో “అపరిచితుడు” ఎంత పెద్ద విజయం నమోదు చేసిందో తెలిసిందే. సమాజంపై శంకర్ తీసే ఈ వినూత్న సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి సెన్సేషన్ ను నమోదు చేసాయి.

అలా తీసిన అపరిచితుడు సినిమాను ఇప్పటికీ ప్రతీ ఒక్కరూ రిపీటెడ్ గా చూస్తారు. మరి ఈ సినిమాను హిందీలో కూడా అక్కడి స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో చెయ్యనున్నట్టుగా ఆ మధ్య కన్ఫర్మ్ అయ్యింది. మరి మరో లేటెస్ట్ అండ్ అఫీషియల్ అప్డేట్ ఏంటి అంటే ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా శంకర్ నే దర్శకత్వం వహించడం కన్ఫర్మ్ అయ్యింది.

అలాగే ఈ చిత్రాన్ని అక్కడ పెన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించనున్నారు. మరి వీరే మన సెన్సేషనల్ పాన్ ఇండియన్ చిత్రం “RRR” నార్త్ హక్కులను భారీ మొత్తానికి కొన్న సంగతి తెలిసిందే. సో మొత్తానికి ఈ సంచలనాత్మక కాంబో ఇలా ఫైనలైజ్ అయ్యింది. వీటితో పాటుగా ఈ చిత్రం వచ్చే ఏడాది మధ్యలో నుంచి స్టార్ట్ కానున్నట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత సమాచారం :