లేటెస్ట్ : ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన బ్లాక్ బస్టర్ ‘బలగం’

Published on Mar 24, 2023 1:00 am IST

ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ బలగం. తెలంగాణ నేపథ్యంలో జరిగే కథగా ఆకట్టుకునే కథనాలతో ఎంతో హృద్యంగా దర్శకుడు వేణు తెరకెక్కించిన ఈ మూవీ తొలి రోజు తొలి ఆట నుండి సూపర్ హిట్ టాక్ ని అద్భుతమైన కలెక్షన్ ని సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది.

దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థ పై హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈమూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా ఇతర పాత్రల్లో సుధాక‌ర్ రెడ్డి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప లక్ష్మి, జయరాం, విజ‌య‌ల‌క్ష్మి, వేణు టిల్లు త‌దిత‌రులు నటించారు. ఇక ఈ మూవీ నేటి నుండి ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి అందుబాటులోకి వచ్చేసింది. కొద్దిసేపటి క్రితం నుండి ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ భాషల ఆడియన్స్ కి అందుబాటులోకి రావడం జరిగింది. అయితే ఓవైపు థియేటర్స్ లో మంచి కలెక్షన్ రాబడుతున్న ఈ మూవీ సడన్ గా ఓటిటి లోకి రిలీజ్ అవడం సర్ప్రైజ్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :