బాక్సాఫీస్ బ్లాస్ట్: కమల్, రజినీ మల్టీస్టారర్ కోసం మ్యూజిక్, దర్శకులు వీళ్ళే!

బాక్సాఫీస్ బ్లాస్ట్: కమల్, రజినీ మల్టీస్టారర్ కోసం మ్యూజిక్, దర్శకులు వీళ్ళే!

Published on Feb 20, 2026 10:00 PM IST

rajinikanth kamal

ఇప్పుడు సౌత్ లో మంచి హైప్ సెట్ చేసుకున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ల కలయికే అని చెప్పాలి. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి రేపు మేకర్స్ సాలిడ్ ట్రీట్ ని సిద్ధం చేస్తుండగా ఈ ట్రీట్ తోనే దర్శకుడు ఎవరు, సంగీత దర్శకుడు ఎవరు అనేవి రివీల్ అవుతాయి అనుకున్నారు.

కానీ మేకర్స్ దీనిపై బిగ్ క్లారిటీ ముందే ఇచ్చేసారు. అంతా ముందు నుంచి అనుకుంటున్న సెన్సేషనల్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మాసివ్ మల్టీస్టారర్ కి దర్శకత్వం వహిస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అంతే కాకుండా అనిరుద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంగీతం అందిస్తున్నట్టు కూడా కన్ఫర్మ్ చేశారు. మరి రేపు రానున్న ప్రోమో ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఆల్రెడీ జైలర్ 2 ప్రోమోతోనే నెల్సన్ దుమ్ము లేపాడు. ఇక ఇద్దరు లెజెండ్స్ తో అంటే ఆ కంటెంట్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. అలాగే సినిమా కూడా బాక్సాఫీస్ బ్లాస్ట్ చేసే లెవెల్లోనే ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు