ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే “పెద్ది”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే జాన్వీ కపూర్ హీరో హీరోయిన్స్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామా గ్రాండ్ విడుదలకి సిద్ధం అవుతుంది. ఇక రీసెంట్ గానే సినిమా తాలూకా ట్రైలర్ ని మేకర్స్ ఫిక్స్ చేయగా ఈ ట్రైలర్ తర్వాత వెంటనే వచ్చే నెక్స్ట్ సాలిడ్ ట్రీట్ కోసం అధికారిక క్లారిటీ ఇప్పుడు ఇచ్చేసారు.
ఇటీవల శృతి హాసన్, రామ్ చరణ్, జాన్వీలపై తెరకెక్కించిన స్పెషల్ సాంగ్ ని మేకర్స్ ట్రైలర్ తర్వాత విడుదల చేయనున్నట్టుగా ఖరారు చేశారు. సో పెద్ది ట్రైలర్ బ్లాస్ట్ తర్వాత రెహమాన్ మ్యాజికల్ ఐటెం సాంగ్ రానుంది అని చెప్పొచ్చు. ఇక దీని తాలూకా డేట్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణం వహించగా ఈ జూన్ 4న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో సినిమా విడుదల కాబోతుంది.
TRAILER LAUNCH ✅️
SPECIAL SONG LAUNCH ✅️Stay tuned to @PeddiMovieOffl 💥💥💥💥 It's going to be Massive pic.twitter.com/wQcKxZZKqU
— PEDDI (@PeddiMovieOffl) May 12, 2026


