“సాహో”కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం !

Published on Jun 16, 2019 5:30 pm IST

రోజురోజుకి రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో. ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లకి సిద్ధ‌మౌతోంది. కాగా తాజాగా సాహో ట్రైలర్ ను జూన్ 13న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇక యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండడం విశేషం. రన్ రాజా రన్, విశ్వరూపం, జిల్ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు జిబ్రాన్. అయితే ‘సాహో’ చాప్టర్ 2 కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించింది కూడా జిబ్రానే. మొత్తానికి జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సాహోకి ప్రత్యేకంగా నిలవనుంది.

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More