స్టార్ నటుడు విక్టరీ వెంకటేష్ ఇటీవల శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సైంధవ్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. దీని అనంతరం ఆయన ఎవరితో మూవీ చేస్తారు అనే దాని పై కొన్నాళ్ల నుండి ఫ్యాన్స్ ఆడియన్స్ లో ఆసక్తి ఏర్పడింది. కాగా యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో దిల్ రాజు నిర్మాణంలో ఒక మూవీ చేసేందుకు సిద్ధం అయ్యారు వెంకీ.
ఆయన కెరీర్ 76వ మూవీ గా రూపొందనున్న దీనికి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పరిశీలనలో ఉంది. విషయం ఏమిటంటే, నేడు ఉగాది పండుగ సందర్భంగా సాయంత్రం 5గం. 49 ని. లకు ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ ఒక వీడియో బైట్ ద్వారా అందించారు మేకర్స్. ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ మధ్య సాగె ట్రయాంగిల్ క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీ గురించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఇక ఈ మూవీకి భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తున్నారు.
Back with Anil and the best team for something very EXciting ♥️
Happy Ugadi ????#VenkyAnil3 @AnilRavipudi #BheemsCeciroleo#DilRaju #Shirish #SVC58 pic.twitter.com/Zg7VC8eaVr
— Venkatesh Daggubati (@VenkyMama) April 9, 2024


