అఫీషియల్: నైజాంలో ‘టాక్సిక్’కి టికెట్ ధరల పెంపు.. డీటెయిల్స్ ఇవే!

అఫీషియల్: నైజాంలో ‘టాక్సిక్’కి టికెట్ ధరల పెంపు.. డీటెయిల్స్ ఇవే!

Published on Aug 25, 2026 1:49 PM IST

Toxic

కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన లాంగ్ అవైటెడ్ చిత్రమే ‘టాక్సిక్’. అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకి ఆడియెన్స్ ని అలరించడానికి మరికొన్ని గంటల్లో రాబోతుంది. అయితే అన్ని చోట్లా బుకింగ్స్ తెరుచుకున్నాయి కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం టికెట్ ధరల హైక్ తో రానుంది అని అందుకే ఈ ఆలస్యం అన్నట్టు తెలిసింది.

ఇక అనుకున్నట్టు గానే ఫైనల్ గా నైజాం మార్కెట్ లో ఈ సినిమాకి టికెట్ ధరల హైక్ ఇస్తూ అధికారిక జీవో బయటకి వచ్చింది. సింగిల్ స్క్రీన్స్ పై 50 రూపాయలు, మల్టిప్లెక్స్ లలో అదనంగా 100 రూపాయల పెంపుతో ‘టాక్సిక్’ సినిమాకి రోజు 5 షోస్ చొప్పున అనుమతిని తెలంగాణ ప్రభుత్వం అందించింది.

ఈ 26 నుంచి సెప్టెంబర్ 4 వరకు మొత్తం 10 రోజులు పాటుగా పెంపునకు అనుమతి ఇచ్చారు. అలాగే ఇదే జీవోలో నిర్మాణ సంస్థలు కే వి ఎన్ ప్రొడక్షన్స్, యష్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్ వారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీ వెల్ఫేర్ కమిటీకి 1 కోటి రూపాయలు విరాళంగా ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ జీవో వారి కోసం విడుదల చేయడం జరిగింది. సో టాక్సిక్ బుకింగ్స్ ఇకపై తెరుచుకోనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు