గవర్నర్ మెచ్చిన ‘ఓ బేబీ’…!

Published on Aug 6, 2019 1:08 pm IST

రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సతీసమేతంగా ‘ఓ బేబీ’ చిత్రాన్ని వీక్షించారు. చిత్ర బృందం ఆయనకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. చిత్ర యూనిట్ ఆయనకు గౌరవ ఆహ్వానం పలికినట్టు సమాచారం. ‘ఓ బేబీ’ మూవీ చూసిన గవర్నర్ చిత్ర నటి సమంతతో పాటు,దర్శకురాలు నందిని రెడ్డి,నిర్మాతలను ప్రశంసించడంతో పాటు వారికి అభినందనలు తెలిపారు.

గత నెలలో విడుదలైన ఓ బేబీ సూపర్ హిట్ గా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని వసూళ్లు సాధించిన ‘ఓ బేబీ’ చిత్రం యూఎస్ లో ఏకంగా వన్ మిలియన్ వసూళ్లు సాధించి ఈ ఘనత అందుకున్న మొదటి లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రికార్డు నమోదు చేసింది. ఈ చిత్రం హిందీలో రీమేక్ చేయనున్నారు. అలాగే చైనాలో కూడా విడుదల చేసే యోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నారు.

సంబంధిత సమాచారం :