సమంత ‘ఓ బేబీ’ తెలుగులో మాత్రమే !

Published on Mar 16, 2019 12:47 pm IST

స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ఓ బేబీ’. నిన్నటి తో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాగ శౌర్య ముఖ్య పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా తెలుగులో మాత్రమే రిలీజ్ కానుంది. సమంత నటించిన గత చిత్రాలు తమిళంలో కూడా విడుదలయ్యాయి కానీ ఈ చిత్రాన్ని మాత్రం డబ్ చేయడం లేదని సమాచారం.

సురేష్ బాబు నిర్మిస్తున్న ఈచిత్రం కొరియన్ మూవీ మిస్ గ్రాన్ని కి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈచిత్రం సమ్మర్ లో విడుదలకానుంది. ఇక ఈ చిత్రం తరువాత సమంత ,శర్వానంద్ తో కలిసి 96 తెలుగు రీమేక్ లో నటించనుంది. అలాగే ఆమె నటించిన తాజా చిత్రం మజిలీ వచ్చే నెల 5న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More