సమంత ” ఓ బేబీ” ట్రైలర్ ట్రీట్ ఎప్పుడంటే….?

సమంత ” ఓ బేబీ” ట్రైలర్ ట్రీట్ ఎప్పుడంటే….?

Published on Jun 19, 2019 8:39 PM IST

లేడి డైరెక్టర్ నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “ఓ బేబీ”. కొరియన్ మూవీ “మిస్ గ్రాని”కి అనువాదంగా తెలుగు,తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఇరవై ఏళ్ల యువతిలో 70ఏళ్ల వృద్ధురాలి ఆత్మ ప్రవేశిస్తే ఎలా ఉంటుంది అనే అంశాలు ప్రధానంగా ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా సురేష్ ప్రొడక్షన్స్,గురు ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విదుదలైన చిత్ర టీజర్, ప్రోమో సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

రేపు ఉదయం 10 గంటలకు మూవీ ట్రైలర్ ని విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సమంత సరసన నాగ శౌర్య నటిస్తుండగా,లక్ష్మీ,రావు రమేష్,రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంగీతం మిక్కిజె మేయర్ అందిస్తున్నారు. జులై 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు