2020లో వచ్చిన తమిళ చిత్రం ‘ఓ మై కడవులే’ మంచి విజయాన్ని సాధించింది. అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అశోక్ సెల్వన్, రితిక సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. దీనికి కూడ అశ్వత్ మరిముత్తుయే దర్శకుడు కాగా దర్శకుడు తరుణ్ భాస్కర్ మాటలు రచిస్తున్నారు.
ఇక ఈ సినిమా ఇప్పుడు హిందీలోకి కోడ్ రీమేక్ కానుంది. ఆ రీమేక్ కూడ అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలోనే ఉండటం విశేషం. ఈ హిందీ వెర్షన్ కు ఉమేష్ శుక్లా రచనా బాధ్యతలను చూసుకుంటున్నారు. ఉమేష్ శుక్లానే నిర్మాతగా కూడ వ్యవహరిస్తున్నారు. తెలుగు రీమేక్ పూర్తైన వెంటనే హిందీ రీమేక్ స్టార్ట్ చేస్తారు అశ్వత్. మరి తమిళంలో అంత మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగు, హిందీలలో ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.


