
మణిరత్నం ఇటీవల తెరకెక్కించిన ఒకే బంగారం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా హిందీలో రీమేక్ అవ్వడానికి సిద్ధపడుతుంది. తాజా సమాచారం ప్రకారం మణి అసిస్టంట్ గా పనిచేసిన షాద్ ఆలీ దర్శకత్వం వహించనున్నాడు.
ఈ హిందీ వెర్షన్ లో ఆదిత్య రాయ్ కపూర్, సొనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారులుగా నటించనున్నారు. ఈ సినిమా త్వరలో చిత్రీకరణ ప్రారంభంకానుంది. ఒక ప్రముఖ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరిన్ని వివరాలకోసం మా సైట్ ని చూస్తూ వుండండి.

