చాలాసార్లు వాయిదాపడిన తరువాత ఎట్టకేలకు అక్టోబర్ 17న నాగచైతన్య నటించిన ‘ఒక లైలాకోసం’ సినిమా విడుదలైంది. అయితే ఈ సినిమా టెలివిజన్ ప్రిమియర్ ప్రదర్శన కోసం నిర్మాతలు ఎక్కువ కాలం వేచి వుండటంలేదు. రిలీజ్ అయిన ఐదు వారాలలోనే(ఈ నెల 23న) టి.వి లో ప్రిమియర్ షో వేసేందుకు సిద్ధమయ్యారు. ఇది ఒక రికార్డుగా నిలిచింది. గతంలో విడుదలైన 36 రోజులలో ‘శశిరేఖ పరిణయం’ సినిమా ప్రిమియర్ షో రూపంలో వున్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. మా టి.వి తీసుకున్న ఈ నిర్ణయం మరిన్ని సినిమాలను ఉత్తేజపరుస్తుందని ఒక అంచనా
పూజ హెగ్డే, నాగ చైతన్య జంటగా నటించిన ‘ఒక లైలాకోసం’ సినిమా సింపుల్ అండ్ క్యూట్ స్టోరీగా మన్ననలను పొందింది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాను తెరకెక్కించిన విజయ్ కుమార్ కొండా ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి పాజిటీవ్ రివ్యూలను అందించి ప్రేక్షకులు హిట్ గా డిక్లేర్ చేసారు. ఒకవేళ ఈ చిత్రాన్ని థియేటర్ లో మిస్ అయితే ప్రిమియర్ షోని మాత్రం మిస్సవ్వకండిమరి..


