నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ ఆడియో రిలీజ్ డేట్

నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ ఆడియో రిలీజ్ డేట్

Published on Aug 6, 2014 9:04 AM IST

oka-lila-kosam

‘మనం’ సినిమా విజయంతో అత్యంత ఉత్సాహంగా ఉన్న యంగ్ హీరో నాగ చైతన్య అప్పుడే ‘ఒకలైలాకోసం’ సినిమాని పూర్తి చేసి త్వరలో రిలీజ్ చెయ్యడానికి సిద్దమవుతోంది. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని సాంగ్స్ ని కూడా ఇటీవలే స్విట్జర్ ల్యాండ్ లో షూట్ చేసారు. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోని ఆగష్టు 15న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తున్నారు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ మూవీని సెప్టెంబర్ 5న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేం విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని ఫ్యామిలీ ఈ మూవీని నిర్మిస్తోంది.

తాజా వార్తలు