ఈ రోజు రాత్రికే నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ ట్రైలర్

ఈ రోజు రాత్రికే నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ ట్రైలర్

Published on Aug 11, 2014 6:27 PM IST

okalila-kosam
‘మనం’ సినిమా విజయంతో అత్యంత ఉత్సాహంగా ఉన్న యంగ్ హీరో నాగ చైతన్య అప్పుడే ‘ఒకలైలాకోసం’ సినిమాని పూర్తి చేసి త్వరలో రిలీజ్ చెయ్యడానికి సిద్దమవుతోంది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు. అందులో భాగంగా ఈ రోజు రాత్రి 9 గంటలకు ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమా ఆడియోని ఆగష్టు 15న రిలీజ్ చేసి సినిమాని సెప్టెంబర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేం విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని ఫ్యామిలీ ఈ మూవీని నిర్మిస్తోంది.

తాజా వార్తలు