సమీక్ష : ‘ఒకటే లైఫ్‌’ – బాగా బోర్ గా సాగుతుంది !

సమీక్ష : ‘ఒకటే లైఫ్‌’ – బాగా బోర్ గా సాగుతుంది !

Published on May 4, 2019 3:59 AM IST
Nuvvu Thopu Raa movie review

విడుదల తేదీ : మే 03, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : జితన్‌ రమేష్‌, శృతి యుగల్‌, సుమన్, వేణు తదితరులు

దర్శకత్వం : ఎం.వెంకట్‌

నిర్మాత : నారాయణ రామ్‌

సంగీతం : అమ్రీష్‌

సినిమాటోగ్రఫర్ : గిరి


సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ అధినేత ఆర్‌.బి.చౌదరి తనయుడు జితన్‌ రమేష్‌ హీరోగా లార్డ్‌ వెంకటేశ్వర ఫిలింస్‌ పతాకంపై నారాయణ రామ్‌ నిర్మిస్తొన్న చిత్రం ‘ఒకటే లైఫ్‌’. ‘హ్యాండిల్‌ విత్‌ కేర్‌’ అన్నది ఉప శీర్షిక. శృతి యుగల్‌ కథానాయిక. ఎం.వెంకట్‌ దర్శకత్వం వహించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

స్టోరీ:

రామ్ (రమేష్) పక్కా మనీ మైండెడ్. ఎక్కువ డబ్బులు సంపాధించాలనే ఉద్దేశ్యంతో.. లవ్ లో సమస్యలు ఉన్న వారి కోసం.. వారి సమస్యలను తీర్చటం కోసం ఓ సంస్థను పెడతాడు. అయితే ఆ సంస్థలో మొదటి కేస్ రామ్ బెస్ట్ ఫ్రెండ్ ప్రేమ్ దే వస్తోంది. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం రామ్, ప్రేమ్ కు అతని లవర్ ప్రియకు వివాహం చేస్తాడు. కానీ కొన్ని రోజుల తరువాత ప్రేమ్ ప్రియను వదిలేసి పారిపోతాడు. చివరికీ వారిని కలపాల్సిన బాధ్యత రామ్ నే తీసుకోవాల్సి వస్తోంది. మరి రామ్ వారిని మళ్లీ కలిపాడా ? లేదా ? అసలు ప్రేమ్ ప్రియను ఎందుకు వదిలేసి పారిపోయాడు ? దీని వెనుక ఏమైనా బలమైన కారణం ఉందా ? ప్రేమ్ జాడను తెలుసుకోవడానికి రామ్ ఏం చేశాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో హీరోగా నటించిన హీరో రమేష్ ఈజ్ తో సెటిల్డ్ గా నటించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా మొదటి భాగంలో సాగే కీలక సన్నివేశాల్లో గాని, ఫ్రేమ్ ను వెతికే క్రమంలో వచ్చే సన్నివేశాల్లో గాని, రమేష్ నటన బాగుంది. మొత్తం మీద మంచి భావోద్వేగాలతో ఎమోషనల్ గా నటించే ప్రయత్నం చేసాడు. డాన్స్ మరియు పోరాట సన్నివేశాల్లో కూడా అతని హార్డ్ వర్క్ తెర పై స్పష్టంగా కనిపిస్తుంది.

ఇక ప్రియ పాత్రలో నటించిన నటి కూడా తన నటనతోనూ అలాగే తన గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. ఈ సినిమాలో హాస్యనటుడు వేణు పోషించిన కామెడీ పాత్ర పర్వాలేదు. వేణు తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఓవరాల్ గా చివరికి సినిమాలో ఇచ్చిన ఒక సామాజిక సందేశం చాలా బాగుంది. అనుభవం లేకపోయినా ప్రతిభావంతమైన నటీనటులు ఉన్న ఈ చిత్రంలో వాళ్ళు తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్:

ఈ సినిమా ఒక మంచి నోట్ లో మొదలైనా.. సినిమాలో యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నా.. అవి ఆకట్టుకునే విధంగా లేవు. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ కథలో మిళితమయి సాగవు. పైగా కథనం కూడా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. ఇక అక్కడక్కడ నవ్వించారు గాని, అది ఎంతో కష్టపడి నవ్వించన్నట్టే ఉంటుందిగాని సహజంగా ఉండదు. ముఖ్యంగా దర్శకుడు కథలోని మెయిన్ కాన్ ఫ్లిట్ ను వదిలేసి, అనవసరమైన ట్రాక్ లతో సినిమాని నింపడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది.

సెకెండ్ హాఫ్ లో కూడా కథనం బాగాలేదు. ఒకేసారి రెండు సినిమాలు చూసిన భావన కలుగుతుంది. క్లైమాక్స్ భాగాన్ని మినహాయిస్తే.. మొత్తం సినిమా ఆకట్టుకోదు. దీనికి తోడు బలం లేని కథలో బలహీన పాత్రలను సృష్టించి సినిమా మీద కలిగే ఆ కాస్త ఇంట్రస్ట్ ని కూడా దర్శకుడు నీరుగార్చాడు.

 

సాంకేతిక విభాగం :

దర్శకుడు ఎం.వెంకట్‌ మంచి కాన్సెప్ట్ తీసుకున్నప్పటికి.. దాన్ని తెర మీద చూపెట్టడంలో మాత్రం విఫలమయ్యాడు. సినిమాలో గిరి కెమెరా పనితనం మాత్రం ఇంప్రెస్ అయ్యేలా ఉంది. ఆయన తీసిన విజువల్స్, కొన్ని షాట్స్ బాగున్నాయి.

సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. అలాగే అమ్రీష్ సంగీతం కూడా పర్వాలేదనిపిస్తోంది. ఇక ఎడిటర్ పనితనం పర్వాలేదు. నిర్మాత నారాయణ రామ్‌ సినిమా పై బాగానే ఖర్చు పెట్టారు.

 

తీర్పు:

హ్యూమన్‌ రిలేషన్స్‌ కు, ఎమోషన్స్‌ కు ప్రాధాన్యత ఇవ్వాలన్న కథాంశంతో యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ గా వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. దర్శకుడు మంచి కాన్సెప్ట్ తీసుకున్నప్పటికి.. తన దర్శకత్వ పనితనంతో మెప్పించలేకపోయాడు. ముఖ్యంగా కాన్సెక్ట్ బాగున్నా.. కథకథనాలు ఆకట్టుకోకపోవడం, ఆసక్తిగా సాగని సన్నివేశాలు.. ఇలా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆకట్టుకోదు. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి.

 

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు