‘ప్రస్థానం’ లాంటి వైవిధ్యమైన సినిమాతో మనకు పరిచయమైన యువ కథానయకుడు సందీప్‌కిషన్ ఆ తరువాత ‘రొటీన్ లవ్‌స్టోరి’, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘టైగర్’ వంటి విలక్షణమైన చిత్రాలతో మంచి విజయాలు సాధించినా ఇటీవల వచ్చిన ’రన్’ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ఇప్పుడు ఆయన నిత్యామీనన్ తో కలిసి డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ’ఒక అమ్మాయి తప్ప..’ సినిమా షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుంది.
ఈ సినిమా ఆడియో ని వచ్చే నెల 8 న హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో జరపబోతున్నట్లు సమాచారం. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఓ పాట పాడటం విశేషం. ఛోటా కె నాయుడు ఈ సినిమాకి ఛాయాగ్రహణం బాధ్యతలు నిర్వహిస్తుండగా ‘సినిమా చూపిస్తమావ’ చిత్రానికి నిర్మాత గా ఉన్న భోగాది అంజిరెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయిత గా పని చేసిన రాజ సింహా తాడినాడ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.


