శివచౌదరి, జశ్విక జంటగా చెంచయ్య నూతలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒక్క చూపుతో మెదలైన..’ సినిమా ట్రైలర్ విడుదలైంది. శ్రీ ఆంజనేయ క్రియేషన్స్ పతాకంపై పోలూరి బిందుసారధి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి హీరో శ్రీకాంత్, నటుడు శివాజీ రాజా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మంచి కంటెంట్‌తో వచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని శివాజీ రాజా పేర్కొన్నారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత సహకారంతో మంచి చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు చెంచయ్య చెప్పారు. కార్యక్రమానికి సహకరించిన వారికి నిర్మాత పోలూరి బిందుసారధి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ చిత్రంలో డి.ఎస్. రావు, సత్యవర్మ, పటాస్ రాము తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు చైతన్య రాజ సంగీతం అందించగా, అనం వెంకట్ ఛాయాగ్రాహకుడిగా, మహేంద్రనాథ్ ఎడిటర్‌గా పనిచేశారు.
