సూపర్ స్టార్ మహేష్ ‘ఒక్కడు’ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల డేట్, టైం ఫిక్స్

Published on Dec 22, 2022 4:00 pm IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ డైరెక్టర్ గుణశేఖర్ ల క్రేజీ కాంబినేషన్ లో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కి 2003 లో రిలీజ్ అయిన మూవీ ఒక్కడు. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో మహేష్ బాబు, అజయ్ అనే పవర్ఫుల్ రోల్ లో నటించగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, ఓబుల్ రెడ్డి పాత్ర లో అదరగొట్టారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా అప్పట్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది.

అయితే విషయం ఏమిటంటే, 2003 జనవరి 15న రిలీజ్ అయి సెన్సేషన్ సృష్టించిన ఒక్కడు మూవీని రాబోయే 2023 జనవరి 7న అనగా సరిగ్గా 20 ఏళ్ళ అనంతరం భారీ స్థాయిలో 4కె వర్షన్ లో రీ రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు. కాగా ఈ ప్రతిష్టాత్మక మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని డిసెంబర్ 24న సాయంత్రం 7 గంటలకు యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు. మరి అప్పట్లో సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకున్న ఒక్కడు ఇప్పుడు ఏ స్థాయిలో అలరించి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :