బాలీవుడ్ లో సందడి చేస్తున్న ‘ఒక్కడు’ రీమేక్

బాలీవుడ్ లో సందడి చేస్తున్న ‘ఒక్కడు’ రీమేక్

Published on Dec 12, 2014 1:52 AM IST

Tevar (2)
టాలీవుడ్ లో పెద్ద హిట్ అయిన ‘ఒక్కడు’ మహేష్ బాబు కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. బాలీవుడ్ యువ నటుడు అర్జున్ కపూర్ ‘ఒక్కడు’ హింది రీమేక్ ‘తేవర్’ లో హీరోగా మన ముందుకు రానున్నాడు.

త్వరలో విడుదలకాబోతున్న ఈ చిత్రం కోసం బాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ చిత్రంలోని పాటలని చాలా అందంగా చిత్రీకరించారు. ఈ చిత్రం విజువల్స్ ప్రేక్షకులకి ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో శృతి హాసన్ ఒక ఐటెం సాంగ్ లో నటించడం కొసమెరుపు. బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది.

 

 

తాజా వార్తలు