సరికొత్తగా ఉన్న “ఓల్డ్ మాంక్” ట్రైలర్…ఆకట్టుకుంటోంది గా!

Published on Aug 26, 2021 7:00 pm IST

శ్రీని, అదితి ప్రభుదేవా హీరో హీరోయిన్ లుగా శ్రీని దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఓల్డ్ మాంక్. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల అయింది. ఈ చిత్రం లో కథ మరియు కథనం చాలా డిఫెరెంట్ గా, సరికొత్తగా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటం తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని సిద్ది ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ పతకాల పై సృజన్ యరబొలు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం లో హీరో క్యారక్టరైజేషన్ సరికొత్తగా చూపించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ లో హీరో డైలాగ్స్ మరియు కామెడీ యాంగిల్ ను చూస్తుంటే రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ అనిపిస్తోంది. ఈ చిత్రం ను వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :