“ఆదిపురుష్” షూట్ పై ఓంరౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Mar 23, 2021 12:38 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పలు ఆసక్తికర పాన్ ఇండియన్ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో “ఆదిపురుష్” అనే భారీ ఇతిహాస కావ్యంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం తాలూకా షూట్ ముంబైలో శరవేగంగా జరుపుకుంటుంది.

అయితే అసలు సెట్స్ లో ఈ చిత్రం తాలూకా షూట్ ఏ విధంగా జరుగుతుందో దర్శకుడు ఓంరౌత్ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. తాను చేస్తున్న ఆదిపురుష్ ఇతిహాస చిత్రం షూట్ సమయం అంత విపరీతమైన పాజిటివిటితో అనిపిస్తుంది అని అంతే కాకుండా అంతే ఎనర్జీ కూడా సెట్స్ లో తమకి అనిపిస్తుంది అని ఓంరౌత్ తెలిపాడు.

దీనితో ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతున్నాయి. షూటింగ్ స్పాట్ లోనే అంత పాజిటివ్ ఎనర్జీ ఇస్తే సిల్వర్ స్క్రీన్ పై ఇంకెలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో నటిస్తుండగా కృతి సనన్ సీతాదేవిగా కనిపించనుంది. అలాగే సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగష్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :