జీనియస్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ఓంకార్ రాజు గారి గది సినిమాతో మంచి విజయం సాధించాడు. ఈ సినిమా తరువాత నాగార్జున తో రాజుగారి గది 2 తీసాడు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఓంకార్ ఒక చానెల్ లో గేమ్ షో చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తాను త్వరలో రాజుగారి గది 3 చెయ్యబోతున్నానని వెల్లడించాడు.
రాజుగారి గది 2 సినిమా తరువాత ఓంకార్ బెల్లంకొండ శ్రీనివాస్ కు ఒక కథ చెప్పడం జరిగింది. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా మొదలు కాలేదు. బెల్లం కొండ శ్రీనివాస్ తోనే రాజుగారిగది 3 చేస్తాడా ?వేరే హీరో ఈ సినిమాలో నటిస్తాడా అన్నది క్లారిటి లేదు. మంచి అవకాశం వచ్చింది కాబట్టి గేమ్ షో చేస్తున్న ఓంకార్ త్వరలో వరుసగా సినిమాలు చెయ్యబోతున్నాడు.


