మరోసారి “వకీల్ సాబ్” నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్.!

Published on Jul 15, 2021 9:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ హ్యాట్రిక్ చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం “పింక్” కి రీమేక్ గా దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా డీల్ చేసి భారీ హిట్ ను పవన్ కెరీర్ లో అందించారు. ఇక ఈ సాలిడ్ చిత్రం గత ఏప్రిల్ నెలలో విడుదలై భారీ ఓపెనింగ్స్ అందుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా విడుదలకు ముందు అసలు ప్రమోషన్స్ ఏమీ జరగట్లేదు ఏంట్రా బాబూ అని అభిమానులు అనుకునే సమయంలోనే కరెక్ట్ గా నిర్మాత నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసి ఒక్కసారిగా భారీ హైప్ ను ఈ సినిమాపై తెప్పించారు. ట్రైలర్ ను వినూత్నంగా కాస్త ముందే థియేటర్స్ లో విడుదల చేయించడం నుంచి నిర్విరామ ఇంటర్వూస్ తో హోరెత్తించారు.

ఇంకా ఈ చిత్రం ఇప్పుడు టీవీల్లో సందడి చేసేందుకు సిద్ధం అవుతుండగా ఛానెల్ వారు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అలర్ట్స్ వేస్తుండగా ఆఫ్ లైన్ లో కూడా గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. వకీల్ సాబ్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ పై హైదరాబాద్ పరిసరాల్లో భారీ కటౌట్స్ తరహాలో పెయింటింగ్స్ తో చూపించి ప్రమోట్ చేస్తున్నారు. టెలివిజన్ ప్రీమియర్ కే ఈ రేంజ్ లో అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. మరి ఇవన్నీ ఈ చిత్రానికి ఎంతమేర టీఆర్పీ ని రాబడతాయో చూడాలి. ప్రస్తుతానికి అయితే పవన్ అభిమానులు సోషల్ మీడియాలో పవన్ అడ్వాన్స్ బర్త్ డే విషెస్ వేడుకలు చేసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :