ఎన్నో అంచనాలు నడుమ లేటెస్ట్ గా రిలీజ్ కి వచ్చిన అవైటెడ్ చిత్రమే ‘అఖండ 2 తాండవం’. నటసింహం బాలకృష్ణ హీరోగా తన హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా పలు ఇబ్బందులు నడుమ విడుదల అయ్యి థియేటర్స్ లో ర్యాంపేజ్ సెట్ చేస్తుంది. అయితే ఈ సినిమా మొదటి భాగానికి బిగ్గెస్ట్ ఎసెట్ లలో దర్శకుడు బోయపాటి, అలాగే బాలయ్య లతో పాటుగా బాక్స్ లు బద్దలయ్యిపోయే సంగీతం ఇచ్చిన సంగీత దర్శకుడు థమన్ కి కూడా సింహ భాగం ఉంది.
అందుకే తన సంగీతం విషయంలో పార్ట్ 2 పై కూడా గట్టి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ అంచనాలుకి తగ్గట్టుగానే థమన్ పార్ట్ 2 కి కూడా సినిమా మొదలైన కొన్ని నిమిషాల్లోనే మాస్ డ్యూటీ ఎక్కేసాడు. అక్కడ నుంచి మొదలైన ర్యాంపేజ్ సినిమా చివరి నిమిషం వరకు కంటిన్యూ చేసి మరోసారి మెయిన్ పిల్లర్ గా నిలిచి తన సంగీత విలయ తాండవం అంటే ఏంటో చూపించాడు అని చెప్పాలి. పార్ట్ 1 లో కొన్ని హిట్ ట్రాక్ లని కూడా కొట్టి సర్ప్రైజ్ చేసాడు థమన్. ఇలా మొత్తానికి మళ్ళీ థమన్ పేరు గట్టిగా వినిపించేలా చేసాడని చెప్పొచ్చు.
