1 మిలియన్ లైక్స్ తో దూసుకుపోతున్న “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్”

Published on Aug 27, 2021 11:20 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సర్కారు వారి పాట చిత్ర యూనిట్ సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరిట టీజర్ ను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం మాత్రమే కాకుండా, యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. 35 మిలియన్స్ కి పైగా వ్యూస్ దక్కించుకొని, 1 మిలియన్ కి పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది.

డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రం లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు 14 రీల్స్ ప్లస్ పతాకాల పై నవీన్ ఎర్నేని, రవి శంకర్, రామ్ ఆచంట మరియు గోపి ఆచంట లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ మాది ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :