వన్ మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతోన్న ఓబులమ్మ ప్రోమో!

Published on Aug 23, 2021 9:50 pm IST

భిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం కొండ పొలం. ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల ఆయిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ చిత్రం నుండి తాజాగా హీరోయిన్ పాత్ర కి సంబంధించిన ఒక ప్రోమో ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే ప్రోమో కి భారీగా వ్యూస్ రావడం విశేషం.

ఈ చిత్రం లో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఓబులమ్మ పాత్ర లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చాలా న్యాచురల్ గా కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం మాత్రమే కాకుండా, ఇప్పటి వరకూ వన్ మిలియన్ కి పైగా వ్యూస్ ను సాధించడం జరిగింది. ఈ చిత్రం లో హీరో పంజా వైష్ణవ్ తేజ్ సరికొత్తగా కనిపిస్తున్నారు. ఈ చిత్రం ను అక్టోబర్ 8 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :