సోషల్ నెట్వర్క్ వల్ల ఇబ్బంది పడ్డ మరో హీరోయిన్

సోషల్ నెట్వర్క్ వల్ల ఇబ్బంది పడ్డ మరో హీరోయిన్

Published on Aug 3, 2014 8:58 PM IST

Ragini-Dwivedi-

స్టార్ నటీనటులకు మరియు సెలబ్రిటీలకు తమ అభిమానులతో మాట్లాడటానికి, తమ అభిప్రాయాలను చేర చేసుకోవడానికి సోషల్ నెట్వర్క్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కానీ దీనివల్ల అప్పుడప్పుడు అనుకోకుండా స్టార్స్ కి కొన్ని సమస్యలను కూడా అతెచ్చి పెడుతుంటుంది.

తాజాగా ఇలాంటి ఓ సమస్యని ‘జెండాపై కపిరాజు’ ఫేం కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది ఫేస్ చేయాల్సి వచ్చింది. దాంతో తను పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. అసలు విషయంలోకి వెళితే రాగిణి ద్వివేది సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇది గమనించిన కొంతమంది రాగిణి ద్వివేదిపై ఫేక్ ట్విట్టర్, ఫేస్ బుక్ పేజ్ లను క్రియేట్ చేసారు. అలా క్రియేట్ చేసి ఆ పేజెస్ ద్వారా రాగిణి ఫేక్ న్యూడ్ ఫొటోస్ ని పబ్లిష్ చేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న రాగిణి శూక్ అవ్వడమే కాకుండా వాటిని ఆపడానికి ట్రై చేసింది. కానీ ఫుల్ గా తన వల్ల కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును డీల్ చేస్తున్నారు.

తాజా వార్తలు