కాసేపట్లో సర్ప్రైజ్ ఇస్తానంటున్న అలవైకుంఠపురంలో టీం

Ala Vaikunthapuramulo1

అల వైకుంఠపురంలో చిత్ర యూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వస్తున్నారు. నేడు ఈ చిత్ర మ్యూజిక్ కాన్సర్ట్ వచ్చే నెల 6న నిర్వహిస్తున్నామని ఒక విషయాన్ని పంచుకున్న చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా మరో సడన్ సర్పైజ్ ఇస్తారట. మరి కొద్దిసేపట్లో అనగా సాయంత్రం 6:00 గంటలకు అలవైకుంఠపురంలో చిత్రం నుండి ఓ ఆసక్తికర అప్డేట్ వస్తుందట. ఆ అప్డేట్ ఏమై ఉంటుందో అని అభిమానులలో ఆసక్తి పెరిగిపోయింది.

ఇక హీరో అల్లు అర్జున్ నిరవధికంగా ఈ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ టబు ఓ కీలక రోల్ చేస్తున్నారు. సుశాంత్, నివేదా పేతురాజ్ ప్రాముఖ్యం ఉన్న పాత్రలలో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది.

Exit mobile version