దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక సినిమా ‘బాహుబలి’. 180 కోట్ల భారి బడ్జెట్ తో ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ పార్ట్ 1 వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్ 17 విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘బాహుబలి’ పార్ట్ 2 ఆ తర్వాత ఏడాది 2016 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో షూటింగ్ చేస్తున్నారు. హిందీతో పాటు ఇతర భాషలలో డబ్ చేయనున్నారు. అన్ని భాషలలో ఒకే టైటిల్ ఉంటె బాగుంటుందనే ఉద్దేశ్యంతో తమిళంలో ‘మహాబలి’ టైటిల్ ను ‘బాహుబలి’గా మార్చారు. ఈ సినిమా నిర్మాణంతర కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఈ సినిమా డబ్బింగ్ వర్క్స్ జరుగుతున్నాయి.
ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మాతలు.


